![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -322 లో.. అమెరికా వెళ్లి త్వరగా రండి అని కృష్ణ అందరి ముందు మురారికి చెప్పి వెళ్తుంది. ఆ తర్వాత కృష్ణ మాట్లాడిన దాని గురించి రేవతి, మధు ఇద్దరు మాట్లాడుకుంటారు. అక్క ముంది మన తింగరి ఎంత దైర్యంగా మాట్లాడిందని మధుతో రేవతి అనగానే.. మరి మీ కోడలంటే ఏం అనుకున్నావని మధు అంటాడు.
ఆ తర్వాత మురారికి గతం గుర్తుకు వస్తే బాగుండని మధు అనగానే.. ఎందుకని రేవతి అడుగుతుంది. ఎప్పటిలాగే కృష్ణ, మురారీలతో రీల్స్ చేసి డబ్బులు సంపాదించవచ్చని అంటాడు.. అప్పుడే కృష్ణ వచ్చి ఏసీపీ సర్ కీ గతం గుర్తుకు వచ్చి.. నా దగ్గరికి రావాలి కానీ ఏకంగా సినిమానే తియ్యచ్చని కృష్ణ అంటుంది. ఆ తర్వాత కృష్ణ వంట చేస్తూ.. భవాని అత్తయ్య నన్ను నమ్మడం లేదు. పూర్తిగా భ్రమ లో ఉందని అనుకుంటుంది. అప్పుడే మురారి వచ్చి మీకు వంటలో హెల్ప్ చేస్తానని అంటాడు. ఆ తర్వాత కృష్ణ వంట చేస్తూ ఉంటే.. మురారికి వేడి ఆయిల్ చెయ్యిపై పడుతుంది. దాంతో కృష్ణ వెంటనే మురారి చేయికి ఆంటిమెంట్ రాస్తుంది. ఆ తర్వాత కృష్ణ తన చేతితో మురారికి భోజనం తినిపిస్తుంది. మురారి ఇంట్లో లేడు ఎక్కడికి వెళ్ళాడని మధుని రేవతి అడుగుతుంది. మురారికి కృష్ణ భోజనం తినిపిస్తుంది అనగానే రేవతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
మరొకవైపు మురారి దగ్గరికి ముకుంద వస్తుంది. కృష్ణ టాపిక్ మురారి తియ్యగానే ముకుందకి కోపం వస్తుంది. కృష్ణ ఏం తప్పు చెయ్యకపోతే ఈ ఇంట్లోకి రావడానికి ఎందుకు భయపడుతుందని ముకుంద అంటుంది. అయిన కృష్ణ తప్పు చేసిందంటే మురారికి నమ్మాలని అనిపించదు. మరొకవైపు కృష్ణ నందుతో మాట్లాడుతుంది. అమెరికాకి ఏసీపీ సర్ వెళ్తే గతం గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత నా దగ్గరే ఉంటాడని నందుతో కృష్ణ చెప్తుంది. ఆ మాటలు భవాని వింటుంది. తరువాయి భాగంలో కృష్ణ తన చిన్నాన్నని కలవడానికి వెళ్తు ఉంటే.. మురారి వచ్చి నేను వస్తానని అంటాడు. ఇప్పుడు ఏసీపీ సర్ తో వెళ్తే చిన్నాన్న అన్ని నిజాలు చెప్తాడు. ఏసీపీ సర్ మైండ్ డిస్టబ్ అవుతుందని కృష్ణ అనుకుంటుంది. మరొకవైపు భవాని వాళ్ళని చూస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |